కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కామినేని ఉమాపతి రావు దహన సంస్కారాలు ముగిశాయి. ఉమాపతి రావు వంశస్థులు దోమకొండ గడి కోట పాలకులు కావడం వల్ల అత్యక్రియలు స్థానికంగానే నిర్వహించారు.
ఉమాపతి రావు భౌతిక కాయాన్ని మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, హీరో రాంచరణ్, ఉపాసన నివాళులు అర్పించారు. కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేష్ దొత్రే, పలువురు ప్రముఖులు సహా రాజకీయ నాయకులు పార్థివ దేహాన్ని దర్శించి కుటుంబీకులను పరామర్శించారు.