ETV Bharat / state

తండాలో రణరంగం..రెండువర్గాల మధ్య వివాదం

ఉపాధి హామీ పనుల దగ్గర మొదలైన వివాదం ఊర్లోకి వచ్చాక రణరంగంగా మారింది. ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా... మరో పదిమందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. పాత కక్షలే కారణ కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

fighting between two groups in peddathanda
పాత కక్షలతో రణరంగంగా మారిన పెద్దతండా
author img

By

Published : Apr 24, 2020, 12:31 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు పెద్దతండాలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. రాళ్లు, కట్టెలతో రెండు వర్గాలు విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా... మరో పది మందికిపైగా స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎల్లారెడ్డి, కామారెడ్డి ఆసుపత్రులకు తరలించారు.

పాత కక్షలతో రణరంగంగా మారిన పెద్దతండా

ఉపాధి హామీ పనుల వద్ద చోటు చేసుకున్న వాగ్వాదం... గ్రామంలోకి వెళ్లిన తర్వాత తీవ్ర ఘర్షణగా మారింది. రాళ్లు, కట్టెలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గొడవకు కారణం పాత కక్షలే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచూడండి: దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.