ETV Bharat / state

'సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించండి'

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని... వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్​ చేశారు.

'సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించండి'
'సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించండి'
author img

By

Published : Oct 31, 2020, 7:11 PM IST

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి... వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు విని రైతులంతా సన్నరకం వరి సాగుచేశారని... భారీ వర్షాలు కురిసి దోమపోటు వ్యాపించిందని తెలిపారు.

పొలాల్లో నీళ్లు నిలిచి సాధారణ వరికోత మిషన్ నడవకపోవడం వల్ల బెల్ట్ మిషన్​కు గంటకు రూ.4వేల వరకు చెల్లించి కోత కోస్తే... ధాన్యానికి రూ.3వేల ఆదాయం కూడా వచ్చేలా లేదని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతులు కోరారు.

ఇదీ చూడండి: అడ్డగుట్ట కార్పొరేటర్ ఇంటిని ముట్టడించిన ముంపు బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.