ETV Bharat / state

దోమకొండలో విద్యుదాఘాతంతో రైతు మృతి - kamareddy news

రోజూలాగే ఈ రోజు కూడా బోరు మోటర్​ వేసేందుకు వెళ్లాడు ఆ రైతు. కానీ... విద్యుదాఘాతంతో అదే పొలంలో విగతజీవిగా మారాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలో చోటుచేసుకుంది.

farmer died with current shock in dhomakonda

author img

By

Published : Aug 23, 2020, 10:53 PM IST

కామారెడ్డి జిల్లా దోమకొండలో విషాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన పిడుగు భూమయ్య(58) రోజూ లాగే ఈరోజు కూడా వ్యవసాయ క్షేత్రంలో బోరుమోటర్ వేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు.

మధ్యాహ్నం వరకు తినడానికి ఇంటికి రాకపోవటం వల్ల కుటుంబీకులు పొలానికి వెళ్లి చూశారు. విగతాజీవిగా పడి ఉన్న భూమయ్యను చూసి గుండెలవిసేలా రోధించారు. భూమయ్యకు భార్య కిష్టమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు.

ఇదీ చూడండి: ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.