కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట్ గ్రామంలో భక్తి ప్రపత్తులతో రేణుక ఎల్లమ్మ జాతర అట్టహాసంగా నిర్వహించారు. గ్రామంలోని గౌడ కులస్థులందరూ ప్రతి ఇంటి నుంచి బోనాలు తీసుకెళ్లి ఎల్లమ్మ తల్లికి సమర్పించారు.
గ్రామమంతా ఎల్లమ్మ నామస్మరణతో హోరెత్తింది. కరోనా లాంటి ఇంకే మహమ్మారి రావద్దని ఎల్లమ్మకు మొక్కుకున్నారు. బంధుమిత్రులతో ఊరంతా సందడిగా మారింది.
ఇదీ చూడండి: 'కొవిడ్ టీకాల పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు'