ETV Bharat / state

కుమార్తె పెళ్లికి సొమ్ములు లేక ఆత్మహత్య - farmers suicide with debt problems

అల్లారు ముద్దుగా పెంచిన కుమార్తెకు ఘనంగా వివాహం చేయాలని ఆ రైతు కలలు కన్నాడు.. కానీ, విధి వక్రించింది.. కష్టసుఖాల్లో తోడుండాల్సిన భార్య కేన్సర్‌తో కాలం చేయటం, ఆమె కోసం అప్పటికే చేసిన అప్పులపై వడ్డీలు అంతకంతా పెరిగిపోవటం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం వల్ల ఆయన నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు.. చివరకు ఇంట్లోనే ప్రాణాలు తీసుకున్నాడు.

daughter's wedding with debt problems, kamareddy telangana news today
కుమార్తె పెళ్లికి సొమ్ములు లేక ఆత్మహత్య
author img

By

Published : Apr 28, 2021, 7:05 AM IST

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్యహత్య చేసుకున్నాడు. జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన బండ్ల లింగయ్య(50)కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తనకున్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది క్రితం ఆయన భార్యకు కేన్సర్‌ సోకడంతో చికిత్సకు రూ.2లక్షలు అప్పు చేశాడు. రెండు నెలల క్రితం ఆమె కన్నుమూసింది.

ఈ నేపథ్యంలో కుమార్తె(23) వివాహం చేసి బాధ్యతలు తీర్చుకుందామని భావించాడాయన. అయితే.. బయట ఎక్కడా అప్పు దొరకకపోవడం, పాత రుణాలకు వడ్డీలు పెరగడంతో మనోవేదనకు గురై మంగళవారం ఉరేసుకున్నాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో పిల్లలు శోక సంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి : పుట్టింటికి వచ్చి.. ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.