ETV Bharat / state

మహరాష్ట్ర సరిహద్దులో భిన్నంగా దసరా వేడుకలు - కామారెడ్డి జిల్లాలో వినూత్నంగా దసరా సంబురాలు

మహారాష్ట్ర సరిహద్దు మండలం మద్నూర్​లో విజయదశమి పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. సాధారణంగా దసరాకు అందరు వాహనాలు, బంగారం కొనుగోలు చేస్తారు. కానీ మద్నూర్ గ్రామస్తులంతా ఒకేచోట చేరి ఉత్సాహంగా సంబురాలు చేసుకుంటారు.

dasara celebrations conducted in different way in madnoor kamareddy dist
మహరాష్ట్ర సరిహద్దులో భిన్నంగా దసరా వేడుకలు
author img

By

Published : Oct 26, 2020, 5:00 AM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామ ప్రజలు దసరా పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. మహరాష్ట్ర సరిహద్దు కావడం వల్ల సంప్రదాయం ప్రకారం వాహనాలు, బంగారం కొనుగోలు చేస్తుంటారు. అందుకు భిన్నంగా మద్నూర్ గ్రామ ప్రజలంతా ర్యాలీగా వెళ్లి ఎల్లమ్మ గుట్టపై ఏటా దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. అక్కడే రావణదహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

చిన్నా, పెద్ద తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొంటారు. గ్రామ సర్పంచ్ గుర్రంపై కూర్చోని భాజభజంత్రీలతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు గ్రామానికి వచ్చి వేడుకల్లో పాల్గొంటారు. ఎన్నో ఏళ్లుగా ఎక్కడలేని విధంగా దసరాను మద్నూర్ గ్రామస్తులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.. కిటకిటలాడిన ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.