కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కొవిడ్ అనుమానితులు ఆందోళన చేపట్టారు. వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మూడు రోజులుగా టెస్టుల కోసం వస్తుంటే కిట్లు లేవని వైద్య సిబ్బంది తిరిగి పంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు కేవలం 50 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారని.. వచ్చేవారు మాత్రం వందల్లో ఉంటున్నారని పేర్కొన్నారు.
కొవిడ్ లక్షణాలతో వస్తున్న తమకు పరీక్షలు చేయడం లేదని.. ఏమీ తెలియని పరిస్థితిలో ఇళ్లకు వెళ్లాలంటే భయం వేస్తుందని వాపోయారు. ఆస్పత్రిలో కిట్ల కొరత ఉందని.. ఉన్నమేరకే టెస్టులు చేస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు.
ఇదీ చూడండి: వ్యాప్తి గొలుసు తెగితేనే కరోనా కట్టడి..!