కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో వైద్యులు, పోలీసు, మీడియా, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలను అందరికీ తెలిసేలా చిత్రాలు గీశారు. పట్టణ తెరాస యువజన విభాగం అధ్యక్షుడు భానుప్రసాద్ ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఈ చిత్రాలను పరిశీలించారు.
కరోనా కట్టడి కోసం నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పోలీస్, మీడియా, మున్సిపల్ సిబ్బందికి చిత్రాల రూపంలో కృతజ్ఞత తెలపడం బాగుందన్నారు. 29 రోజులుగా పేదలు, అనాథలకు నిత్యావసరాల పంపిణీ, అన్నదానం చేస్తున్న తెరాస యువజన విభాగం నాయకులను ఆయన అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ముందుకు రావాలని కోరారు.
ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు