కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోనీ తడకొల్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో 10 మంది ఎస్ఐలు, 120 మంది కానిస్టేబుళ్లతో ఇంటింటా సోదాలు జరిపారు. సరైన ధ్రువ పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రతీ ఒక్కరూ వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, లైసెన్సు, ఇన్సూరెన్స్ బీమా పత్రాలను కలిగి ఉండాలని ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు కానీ నగదు వివరాలు గానీ అడిగితే చెప్పకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని చెప్పారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!