Congress leaders on Suspension: కాంగ్రెస్ నేత మదన్ మోహన్ రావు సస్పెన్షన్ వ్యవహారం ఆ పార్టీలో కాక రేపుతోంది. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో సమావేశమైన మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహేశ్వరరెడ్డి ఇతర నేతలు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రస్థాయి నేతగా ఉన్న మదన్‌ను ఒక జిల్లా అధ్యక్షుడు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వరరెడ్డి డీసీసీ అధ్యక్షుడికి నోటీసులు పంపించారు.
జహీరాబాద్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్‌రావును కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు సస్పెండ్ చేశారు. పార్టీ నియమావళి ఉల్లంఘించారని అయనను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడైన మదన్‌మోహన్‌రావును సస్పెండ్ చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌రా శ్రీనివాస్‌రావుకు లేదని పీసీసీ స్పష్టం చేసింది. మదన్‌మోహన్‌రావుకు చెందిన ఏదైనా ఫిర్యాదు ఉంటే పూర్తి ఆధారాలతో పీసీసీకి నివేదించాలని కామారెడ్డి డీసీసీకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ సూచించారు. ఈ మేరకు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాసరావును వివరణ కోరారు.
మేమే చూసుకుంటాం: నల్గొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల ఇంఛార్జీలుగా ఎవరు అవసరం లేదని తాను, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇద్దరం కలిసి చూసుకుంటామని భువనగిరి ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డిని ఆ నియోజక వర్గాలకు ఇంఛార్జిగా వేయడంతో తామే వద్దని చెప్పామని తెలిపారు. ఆమెను ఇతర నియోజక వర్గాలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిపారు. తమ మధ్య ఏలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు.
ఆయనకు అధికారం లేదు: జహీరాబాద్ ఎంపీ అభ్యర్ధి మదన్‌మోహన్ రావును కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్‌రావు ఏడాదిపాటు సస్పెండ్ చేయడం తప్పని.. ఆ అధికారం డీసీసీకి లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్నిరాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్కం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు ఆలా చేయడం తప్పని ఆయన కూడా చెప్పారని వివరించారు. ఈ విషయంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడికి షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి నివాసంలో సీనియర్ నాయకులు కలియకలో ఏలాంటి రాజకీయం లేదని...రాహుల్ గాంధీ సభను విజయవంతం చేసేందుకు ఏమేమి చేయాలన్న దానిపై కసరత్తు చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు.
ఇవీ చూడండి: వచ్చే ఎన్నికల్లో తెరాసకు పీకే సేవలు.. సరికొత్త ప్రచారానికి ప్రణాళికలు..!
లతామంగేష్కర్ అవార్డ్ అందుకున్న ప్రధాని.. దేశప్రజలకు అంకితం