ETV Bharat / state

బాన్సువాడలో 9 పాజిటివ్ కేసులు... 3 కాలనీలు హాట్​ స్పాట్ - 3 AREAS DECLARED IN KAMAREDDY

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. అనంతరం కరోనా వైరస్ నిర్మూలనకు కరపత్రాలను విడుదల చేశారు. రోజు రోజుకు కరోనా విజృంభిస్తోన్న తరుణంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి అధికారులతో చర్చించారు.

స్వచ్ఛందంగా  కరోనా పరీక్షలకు ముందుకు రావాలి : కలెక్టర్

author img

By

Published : Apr 12, 2020, 3:38 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ, మదీనా కాలనీ, ఆర్ఫాత్ కాలనీల్లో కలెక్టర్ శరత్ పర్యటించారు. పట్టణంలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ శరత్ తెలిపారు. ముందుగా ఆర్డీవో కార్యాలయంలో వైరస్​ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను విడుదల చేశారు. ఈ మూడు కాలనీలను హాట్ స్పాట్ ఏరియాలుగా గుర్తించి కంటైన్మెంట్ క్లస్టర్​గా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

స్వచ్ఛందంగా ముందుకు రావాలి...

పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వాళ్లు స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకు రావాలన్నారు. కాలనీ ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లాక్ డౌన్​కు పట్టణ ప్రజలందరూ విధిగా సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ దామోదర్ రెడ్డి , ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'మర్కజ్​ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.