కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సఖి కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పర్యవేక్షించారు. బాధితులందరికీ చేయూతనివ్వాలని.. సిబ్బంది ప్రజలందరికీ సహకరించాలని సూచించారు. సఖి కేంద్రాల సేవలను బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాలలోని స్త్రీలు తమకు జరిగిన అన్యాయాలను బయటకు చెప్పుకోలేక పోతున్నారని... అలాంటి వారికి సఖి కేంద్రాలు ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
ఇవీ చూడండి: కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం