ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) జిల్లాల పర్యటనలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) మొక్కలు నాటారు. అంతకముందు కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. పాల్గొన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో సీఎం మొక్కలు నాటారు.
అనంతరం కామారెడ్డి నూతన సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ (Cm Kcr) సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, సభాపతి పోచారం, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేత, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు షిండే, సురేందర్ హాజరయ్యారు.
ఇదీ చూడండి: Cm Kcr Fun: సీఎం కేసీఆర్‌నే మాస్క్ తీయమన్నాడంటా!