ETV Bharat / state

పొలం గట్టు తగాదాలతో ఇరువురి మధ్య ఘర్షణ.. ఒకరు మృతి - రాంపూర్​లో పొలం గట్టు తగాదాల్లో రైతు మృతి

పొలం గట్టు తగాదాలు ఒకరి మృతికి కారణమయ్యాయి. కామారెడ్డి జిల్లా రాంపూర్‌ తండాలోని పొలం గట్టు విషయంలో గ్రామంలో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. ఈ ఘర్షణలో దేవేల పోచయ్యపై నలుగురు దాడికి దిగారు.

పొలం గట్టు తగాదాలతో ఇరువురి మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

author img

By

Published : Jul 11, 2020, 1:58 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని రాంపూర్ తండాలో పొలం గట్టు విషయంలో గ్రామంలో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దేవేల పోచయ్య(35)పై ఓ నలుగురు వ్యక్తులు దాడికి దిగడం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

గట్టు నిర్మిస్తామని చెబుతున్న కావాలనే దాడికి దిగి హతమార్చినట్లు మృతుడి తండ్రి ఎల్లయ్య ఆరోపించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ రాజశేఖర్, ఎస్సై శ్వేత పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.