ETV Bharat / state

ప్రజలకు రుచులు.. రైతులకు సిరులు - Cereal refinery at Mallthummeda

సంప్రదాయ పంటల సాగు తగ్గుతున్న సమయంలో వాటి ప్రయోజనాలను గుర్తించిన కామారెడ్డి నాగిరెడ్డిపేట మండలం మాల్​ తుమ్మెదకు చెందిన శ్రీధర్‌రావు గ్రామీణ రుచులు పేరిట చిరుధాన్యాల శుద్ధి కర్మాగారం ప్రారంభించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో కొనుగోలు ఒప్పందాలు చేసుకొని ‘గ్రామీణ రుచుల’ పేరుతో వాటికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు.

ప్రజలకు రుచులు.. రైతులకు సిరులు
ప్రజలకు రుచులు.. రైతులకు సిరులు
author img

By

Published : Dec 24, 2020, 3:25 PM IST

సంప్రదాయ పంటల సాగు తగ్గుతున్న సమయంలో వాటి ప్రయోజనాలను గుర్తించిన కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెదకు చెందిన శ్రీధర్‌రావు గ్రామీణ రుచులు పేరిట చిరుధాన్యాల శుద్ధి కర్మాగారం ప్రారంభించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో కొనుగోలు ఒప్పందాలు చేసుకొని ‘గ్రామీణ రుచుల’ పేరుతో వాటికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు.

కర్మాగారం ప్రారంభించిన మొదట్లో మాల్ తుమ్మెదలో భూమి కొనుగోలు చేసి సొంతంగా చిరుధాన్యాల సాగు ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆశించిన దిగుబడులు రాలేదు. ఆదిలోనే అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. తరువాత చిరుధాన్యాల సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో రాజంపేట, తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్‌ మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం వీటి సాగు చేపడుతోందని తెలుసుకొని వారితో కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్నారు.

Cereal refinery in Maltummeda, kamareddy district
ప్రజలకు రుచులు.. రైతులకు సిరులు

పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి
శుద్ధి ప్రారంభించిన మొదట్లో జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో చిరుధాన్యాలు లభించలేదు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని సంఘాలు కొర్రలు, అండు కొర్రలు పండిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి సామలు, ఊదలు, అరికెలు పండించేలా జిల్లా రైతులను ప్రోత్సహించనున్నారు. ఇటీవల తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడీ రైతులు పండించిన చిరుధాన్యాలు కొన్నారు.
సేంద్రియ ఉత్పత్తులకే ప్రాధాన్యం
ఏడాదిన్నరగా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చిరుధాన్యాలతో పాటు పప్పుదినుసులు, కారంపొడి, పసుపు పొడిని ప్యాకింగ్‌ చేసి ఉమ్మడి నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో విక్రయిస్తున్నారు. రోజు 30 మంది కూలీలకు ఉపాధి లభిస్తోంది. సేంద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జొన్నలతో పాటు తైదలను శుద్ధి చేస్తున్నారు.

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని వంద ఎకరాల్లో చిరుధాన్యాల సాగు చేపట్టాం. వీటికి పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ. మాల్ తుమ్మెదలోని చిరుధాన్యాల శుద్ధి సంస్థతో విపణి ధరకే కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నాం. జిల్లాలోనే శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కావడంతో సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. - రాజేందర్‌, ఏపీఎం, తాడ్వాయి

కల్తీ లేకుండా అందించాలని..
ఆరోగ్యానికి ఉపయోగపడే చిరుధాన్యాల వినియోగదారులు జిల్లాలో పెరుగుతున్నారు. వారికి కల్తీలేని ఉత్పత్తులు అందించడానికి గ్రామీణ రుచుల పేరిట సంస్థ ఏర్పాటు చేశాం. మన జిల్లాలో పండే వాటికి ఇక్కడి రైతుల నుంచే కొనుగోలు చేసి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. రాజధాని నుంచి పలువురు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. - వెంకట్‌రెడ్డి, నిర్వాహకులు, గ్రామీణ రుచులు

వ్యాక్యూమ్‌ ప్యాకింగ్‌

ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వ్యాక్యూమ్‌ ప్యాకింగ్‌ చేస్తున్నారు. దీని వల్ల ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి. పల్లి, నువ్వులను గానుగ పట్టించి నూనెలు విక్రయిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.