అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్ర దేశీదారు మద్యం సిసాలను అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం మద్నూర్ మండలం మల్లాపూర్‌కు చెందిన గోపాల్ ద్విచక్రవాహనంపై 96 దేశిదారు సీసాలను తరలిస్తుండగా.. మండలంలో డోంగ్లి సమీపంలో పట్టుకున్నట్లు బిచ్కుంద అబ్కారీ సీఐ సుధాకర్ తెలిపారు. మద్యం సీసాలతో పాటు.. ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
- ఇదీ చదవండి : తుంపర్ల ద్వారానే వైరస్ వ్యాప్తి అధికం!