ETV Bharat / state

కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, భాజపా శ్రేణులకు మధ్య తోపులాట

BJP Protest: కామారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు అర్హులైన పేదలకు డబుల్ బెడ్​రూం ఇళ్లను పంపిణీ చేయాలని చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ నిరసనలో పోలీసులు, భాజపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : Apr 1, 2022, 8:21 PM IST

కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, భాజపా శ్రేణులకు మధ్య తోపులాట
కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, భాజపా శ్రేణులకు మధ్య తోపులాట

BJP Protest: కామారెడ్డి జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా నాయకులు అర్హులైన పేదలకు డబుల్ బెడ్​రూం ఇళ్లను పంపిణీ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో పోలీసులు, భాజపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి కాలు విరగగా, మరొకరికి తలకు బలమైన గాయమైంది. మరొకరు మూర్ఛపోగా, ఒకరికి చెవినుంచి రక్తస్రావం జరిగింది. నిరసనకారులనందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. పోలీసులు తమ మెడలు పట్టుకుని లాగారని, తన్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొంతమంది మహిళలు చీపుర్లు తీసుకువచ్చి ఇళ్లను ఊడ్చుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని నిలువరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్​రూం ఇళ్లను పంపిణీ చేసే వరకు ఊరుకోమని తెలిపారు. సొంత ఇళ్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటున్నామని.. దానితో కిరాయి భారాలు పెరిగిపోతున్నాయని.. అర్హులైన తమకు ఇళ్లను పంపిణీ చేయాలని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్ వచ్చి ఎప్పుడు ఇళ్లు పంపిణీ చేస్తారో చెబితేనే ధర్నా విరమిస్తామని నిరసనకారులు తెలపగా... ప్రభుత్వం త్వరలోనే ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, రోడ్లు వేయించి అర్హులైన పేదలకు అందిస్తుందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: MOST WANTED THIEF ARRESTED: ఈ 'దొంగ' కలగన్నాడా.. ఎవరికో కష్టమొచ్చినట్టే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.