రెండు పడక గదుల ఇళ్లు తమకు కూడా నిర్మించి ఇవ్వాలని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల బీడీ కార్మికులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్నివిధాలా సమర్థుడు: గుత్తా