ETV Bharat / state

'కోప్టా చట్టంతో బీడీ కార్మికులను రోడ్డున పడేస్తారా?'

కేంద్రం తీసుకొచ్చిన కోప్టా చట్టానికి వ్యతిరేకంగా బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కామారెడ్డి​ జిల్లా కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు.

Beedi workers have raised concerns at the Kamareddy District Collectorate against the kopta Act
కామారెడ్డి​ జిల్లా కలెక్టరేట్ వద్ద బీడీ కార్మికులు ఆందోళన
author img

By

Published : Mar 6, 2021, 9:24 PM IST

కోప్టాచట్టం పేరుతో బీడీ కార్మికులను రోడ్డున పడేస్తారా అంటూ కేంద్రాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క ప్రశ్నించారు. ఈ చట్టం ద్వారా వారికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారని సూటిగా విమర్శించారు. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో మహిళా కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఈ చట్టంతో 60 లక్షల మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం పునరాలోచించాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి: తహసీల్దార్‌ ఎదుట మహిళా రేషన్‌ డీలర్ ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.