విద్యార్థులు విద్యతోనే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యార్థులకు ఆయన ఉచిత దుప్పట్లు, పెన్నులు, యూనిఫామ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందని... వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్క గంగాధర్, జడ్పీటీసీ సభ్యుడు శామ్యూల్, ప్రిన్సిపల్ ప్రభులింగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః ఐక్యతా విగ్రహానికీ తప్పని ముంపు బెడద!