కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 5వ తేదీ నుంచి 9రోజుల పాటు స్వచ్ఛంద సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్టు మున్సిపాలిటి పాలకవర్గం, అఖిలపక్షం నాయకులు తీర్మానించారు. జిల్లాకేంద్రంలో పెరుగుతున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి, పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండేదుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు.
ఆగష్టు 5 నుంచి కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వ్యాపార సముదాయాలు తెరిచి ఉండవని, కేవలం పాలు, కూరగాయలు, మెడిసిన్ వంటి అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు సహకరించి లాన్‌డౌన్ పాటించాలని కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వారు సూచించారు.
ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు