కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని చౌరస్తాలో గల ఓ పాల కేంద్రంలో అదే కాలనీకి చెందిన అస్లాం అనే వ్యక్తి లీటర్ పాలు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి ఆ పాలు మరగబెట్టగా.. అవి విరిగిపోయాయి. అయినా.. పొయ్యి మీద అలాగే ఉంచగా.. పాలు రబ్బరులా మారి గట్టిపడ్డాయి. కల్తీ పాలుగా గుర్తించిన అస్లాం మీడియాకు, ఎస్పీ దామోదర్ రెడ్డికి సమాచారం అందించాడు. గతంలో రెండుమూడు సార్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి తనిఖీ చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: మండుతున్న ఎండలు