కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. అగ్ర వర్ణ కులాల పేదల(ఈడబ్ల్యుఎస్)కి రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గోవర్ధన్ అందుబాటులో లేకపోవడంతో ఇంటిముందు బైఠాయించడానికి కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దేశమంతా అమలు చేస్తున్నా కేవలం తెలంగాణలోనే అమలు కావడం లేదని ఏబీవీపీ నగర కార్యదర్శి మనోజ్ అన్నారు. వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన ప్రైవేటు ఉపాధ్యాయులను కరోనా సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష