ETV Bharat / state

అద్దె చెల్లించలేదని ఇంటి నుంచి గెంటేసిన యజమాని..

సొంత ఇల్లు లేక 25 ఏళ్లుగా అద్దెకుంటున్న ఆ కుటుంబాన్ని ఇంటి యజమాని బయటకు గెంటేశాడు. రెండు పడక గదుల ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటి వరకు వారికి ఇల్లు దొరకలేదు. ప్రభుత్వం స్పందించి తమకు డబుల్ బెడ్​రూం ఇల్లును అందజేయాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఆ కుటుంబం కోరుతోంది.

a family from bansuvada requests government to allocate double bed room
అద్దె చెల్లించలేదని ఇంటి నుంచి గెంటేసిన యజమాని..
author img

By

Published : Nov 21, 2020, 12:23 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని దాల్​మాల్ గుట్టలోని ఓ ఇంట్లో 25 ఏళ్లుగా షరీఫ్ కుటుంబం అద్దెకుంటోంది. షరీఫ్​కు పక్షవాతం రావడం వల్ల ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో ఏడాది నుంచి షరీఫ్ ఇంటి అద్దె చెల్లించకపోవడం వల్ల శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

రోడ్డుమీద పడ్డ ఆ కుటుంబం ఏం చేయాలో పాలుపోక రాత్రంతా ఇంటి డాబాపై ఉన్నారు. రెండు పడక గదుల ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుని పలు మార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకు ఇల్లు దొరకలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమకు డబుల్ బెడ్​రూం ఇల్లును అందజేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.