మే 11న ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు జడ్పీ ఛైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం చెక్కులు పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రామాపురం, వడ్డెపల్లికి చెందిన 16 మంది మరణించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బాధితులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామని జడ్పీ ఛైర్పర్సన్ తెలిపారు. ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులకు మూడెకరాల భూమి ఇచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: 'సమస్యలు ఎక్కడుంటే కాంగ్రెస్ అక్కడుంటుంది'