జోగులాంబ గద్వాల్ జిల్లా మనోపాడు పట్టణంలో వరిగడ్డితో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి గడ్డి దగ్ధమైంది. మానపాడుకు చెందిన రైతు మద్దిలేటి, పెబ్బేరు మండలంలో వరిగడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్ ద్వారా తరలించాడు. మానపాడులోని గాంధీ సెంటర్ వద్దకు రాగానే విద్యుత్ తీగలు తగిలి గడ్డి దగ్ధమైంది. డ్రైవర్ చాకచక్యంతో గడ్డిని కిందికి వేసి దిగిపోయాడు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఊరి మధ్యలో జరిగిన ఈ సంఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు.
గడ్డి లోడు తగలబడింది.. - tractor
గడ్డి లోడుతో ట్రాక్టర్ వెళ్తుండగా విద్యుత్ వైరు తగిలి దగ్ధమైంది. భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన జరిగింది.