ETV Bharat / state

ఉండవల్లి పోలీస్​స్టేషన్​కు బేడీలు... ఎందుకంటే... - gadwal news

ఖైదీలకు వేయాల్సిన బేడీలను పోలీస్​స్టేషన్​ గేటుకు వేశారు ఆ ఊరి పోలీసులు. అంటే ఠాణా ఏదైనా నేరం చేసిందని కాదండోయ్​... సిబ్బంది ఎవరూ లేకపోవటం వల్ల తాళాలకు బదులు బేడీలను ఉపయోగించారట అంతే. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో చోటుచేసుకుంది.

undavalli police station gate lock with cup links

author img

By

Published : Aug 29, 2020, 8:40 AM IST

జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి​ ఠాణాకు పోలీసులు బేడీలు వేశారు. నిజమేనండి.... ఖైదీలకు వేయాల్సిన బేడీలను పోలీస్​స్టేషన్​ గేటుకు తాళంగా ఉపయోగించారు. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై ఎస్సైను వివరణ కోరగా... గణేశ్​ నిమజ్జనం సందర్భంగా సిబ్బంది అందరు బందోబస్తుకు వెళ్లారని తెలిపారు. ఠాణాలో ఒకే కానిస్టేబుల్ ఉండటం వల్ల స్టేషన్ ఆవరణలో వాహనాలు, విలువైన వస్తువులు ఉన్నందును ఈ విధంగా వేశామని వివరించారు. ఇలా మరోసారి జరగకుండా చూస్తానని ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి : కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.