తుంగభద్ర పుష్కరాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎంతో సహనంతో అధికారులు విధులు నిర్వహించారని మంత్రి పేర్కొన్నారు.
తుంగభద్ర పుష్కరాలకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేలా కృషి చేసిన సహచర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే అబ్రహంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో అధికార యంత్రాంగానికి సహకరించిన భక్తులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి : బల్దియా పోరు: ఓటర్లలో అదే నిర్లిప్తత... కారణాలు అవేనా?