జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో సరస్వతీ అమ్మవారి లక్ష బిల్వార్చన కన్నుల పండువగా జరిగింది. చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీ మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ఈ వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఏకాదశి రోజున బాసర సరస్వతీ దేవి ఉత్సవ విగ్రహానికి ప్రభాత సంకీర్థానం, తుంగభద్ర నదిలో చక్ర స్నానం, పంచామృతాభిషేకాలు వేదపండితులు చేశారు.
అమ్మవారికి పుష్కర స్నానం అనంతరం... భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా పుల్లూరు వీధుల గుండా చెన్నకేశవ స్వామి ఆలయానికి తీసుకెళ్లి... లక్ష తులసి దళార్చనలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేదపండితులు భక్తులకు ప్రవచనాలు చెప్పారు.
![tungabhadra pushkaralu at pulluru in jogulamba gadwal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-11-25-pullurlo-puskhara-pujalu-avb-ts10096_25112020162550_2511f_1606301750_943.jpg)
ఇదీ చదవండి: తుంగభద్ర పుష్కరాలు: కార్తిక దీపాలతో వెలుగులీనుతున్న నదీమతల్లి