జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో తుంగభద్ర పుష్కరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మూడోరోజైన ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఉమ్మడి రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో తరలివస్తున్న భక్తులు.. తుంగభద్రా నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఘాట్లోనే సంకల్పం చేసుకుని పూర్వీకులకు పిండప్రదానాలు చేస్తున్నారు. అనంతరం అమ్మవారి సమేత స్వామిని దర్శించుకుంటున్నారు. ఆదివారం కావడం వల్ల భక్తుల తాకిడి ఎక్కువయింది.
- ఇదీ చూడండి : శోభాయమానం.. పద్మావతి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం