జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో ఇసుక ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. తుంగభద్ర నది నుంచి ఇసుకను తరలిస్తూ పగలనక, రాత్రనక గ్రామంలో ప్రమాదకరంగా తిరుగుతున్నాయని పేర్కొన్నారు.
దీనివల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నట్లు ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు ముందుకు వెళ్లకుండా వాటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.