దేశంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా వైరస్‌కు సామూహిక ఉచిత టీకా అందచేయాలని ఏఐసీసీ పిలుపు మేరకు... జిల్లా అడిషనల్ కలెక్టర్ రఘురామ శర్మకు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయన్నారు.
కక్ష సాధింపు చర్యలు..
జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయకుండా... కక్ష సాధింపు చర్యలు తెరాస ప్రభుత్వం చేపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కళాశాలను, అలంపూర్ నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: హెచ్‌సీయూ వీసీగా రేపు అప్పారావు రిలీవ్.. అరుణ్ అగర్వాల్‌కు బాధ్యతలు