తెలంగాణను దేశానికే పచ్చతోరణంగా మలచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయన పర్యటించారు. ఇటిక్యాల మండలం బీచుపల్లి నుంచి పుల్లూర్ వరకు జాతీయ రహదారికి ఇరువైపుల 44 కిలోమీటర్ల మేర 15,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝాతో కలిసి రఘునందన్ రావు మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్జీ ఛైర్పర్సన్ సరితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా