ETV Bharat / state

ఆ బాలిక కంటిలో నుంచి బియ్యం, రాళ్లు.. వైద్యులేమో అలా అంటున్నారు..! - manopadu mandal latest news

Viral News: సాధారణంగా మన కంట్లో ఏదైనా దుమ్ము, ధూళి పడితేనే విలవిల్లాడిపోతాం. కంటిలో చేరిన ఆ వ్యర్థాన్ని బయటకు తీసే వరకు ఏమీ తోచదు. అలాంటిది ఓ చిన్నారి కన్నులో నుంచి గత మూడు రోజులుగా బియ్యం, రాళ్లు వస్తున్నాయి. దీంతో ఆ బాలిక పడే బాధ వర్ణనాతీతంగా మారింది.

stones and Rice Grains  Coming from the Girl Eyes in Jogulamba Gadwala District

author img

By

Published : Nov 13, 2022, 9:15 PM IST

Viral News: జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో మూడు రోజులుగా కంటిలో నుంచి బియ్యం, రాళ్లు వస్తుండటంతో ఓ బాలిక విలవిల్లాడుతుంది. మానవపాడు మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ, రంగన్నల కూతురు దీపాలి. స్థానిక కేజీబీవీలో 6వ తరగతి చదువుతోంది. మూడు రోజుల నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కుడి కంటిలో నుంచి రాళ్లు, బియ్యం వస్తున్నాయి. ఈ విషయాన్ని చిన్నారి ప్రధానోపాధ్యాయునికి తెలిపింది.

ప్రధానోపాధ్యాయుడు బాలిక కుటుంబీకులకు సమాచారం అందించగా.. వారు దీపాలిని స్థానిక వైద్యుడికి చూపించారు. అనంతరం ఏపీ కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి కంటి పరీక్షలు చేయించారు. వైద్యులు ఏమీ లేదని కొట్టిపారేశారు. ఇంటికి తీసుకొచ్చాక మళ్లీ చిన్నారి కంటిలో నుంచి రాళ్లు, బియ్యం వస్తుండటంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజూ 15 నుంచి 20 వరకు రాళ్లు, బియ్యం వస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఫోన్​లో డాక్టర్లను వివరణ కోరగా.. కంటిలో నుంచి బియ్యం రావడం అనేది నమ్మలేనిదని డాక్టర్లు అంటున్నారు.

"నా పేరు దీపాలి. నేను ఆరో తరగతి చదువుతున్నాను. గత మూడు రోజుల నుంచి నా కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు." - దీపాలి, బాధిత చిన్నారి

కంటిలో నుంచి వస్తున్న బియ్యం, రాళ్లు ఎక్కడంటే

"గత మూడు రోజులుగా పాప కంటిలో నుంచి రాళ్లు, బియ్యం వస్తున్నాయని చెప్పింది. దీంతో పాప బాధను చూడలేక కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి కంటి పరీక్షలు చేయించాం. అక్కడ డాక్టర్లు కూడా ఈ విషయాన్ని నమ్మడం లేదు. ఈరోజు 15 నుంచి 20 వరకు రాళ్లు, బియ్యం కంటిలో నుంచి వచ్చాయి." - బాధిత చిన్నారి తల్లి

ఇవీ చదవండి: 15న కేసీఆర్ అధ్యక్షతన తెరాస కార్యవర్గ సమావేశం.. ఆ అంశాలపై చర్చ..!

పిలవని పెళ్లికి వెళ్లి రూ.200 గిఫ్ట్ వద్దనేసరికి నానా రభస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.