జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభించారు. ఇందులో భాగంగా మానపాడు మండల కేంద్రంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ సరిత సందర్శించారు. స్వయంగా జేసీబీ నడిపి పనులు ప్రారంభించారు.
పారిశుద్ధ్య పనులను ఈ ఎనిమిది రోజులే కాకుండా వానాకాలం అయిపోయేంత వరకు కొనసాగించాలన్నారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను ప్రతిఒక్కరు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు, సర్పంచిని ఆదేశించారు.