ETV Bharat / state

బీటీకి నోచుకోని రోడ్లు.. కంకర తేలిన రహదారులు!

జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు మండలాల్లో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కంకర వేసి మధ్యలోనే వదిలేశారు. ఏళ్లు గడుస్తున్నా బీటీకి నోచుకోలేదు. ఏడు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వివిధ గ్రామాలకు రాకపోకల కోసం అవస్థలు పడాల్సి వస్తోందని అంటున్నారు.

road works in alampur, alampur road works
అలంపూర్​లో రోడ్ల పరిస్థితి, మధ్యలోని నిలిచిపోయిన రోడ్ల నిర్మాణం
author img

By

Published : Apr 23, 2021, 1:26 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని పలు మండలాల్లో కంకర వేసిన రోడ్లు ఇప్పటికీ బీటీకి నోచుకోవడం లేదు. రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించినా కొన్ని గ్రామాల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. ఆ పనులూ ముందుకు సాగడం లేదు. బీటీ వేయడానికి ముందు కంకర వేసి వదిలేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ పూర్తి కాలేదు. ఫలితంగా ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

మధ్యలోనే వదిలేశారు!

కోనేరు-అలంపూర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల రోడ్డు కోసం రూ.2.5 కోట్లు మంజూరయ్యాయి కోనేరు-ఊట్కూర్ రెండు కిలోమీటర్ల రహదారి కోసం రూ.90 లక్షలు, ఇమాంపూర్-లింగనవాయి రోడ్డుకు రూ.80 లక్షలు మంజూరు చేశారు. పనులు ప్రారంభించి కంకర వేసి వదిలేశారు. బీటీ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. ఇటిక్యాల మండలంలో పారుపాక స్టోరేజ్ నుంచి కారపాకులా వరకు, మానవపాడు-గోగులపాడు మధ్య రోడ్డు, జాతీయ రహదారి నుంచి బోరవెల్లి వరకు కంకర వేసి వదిలేశారు.

ఏడు మండలాల్లో ఇదే పరిస్థితి

ఐజ మండలంలో దాదాపు 13 కిలోమీటర్ల బీటీ రోడ్డు కోసం రూ.11 కోట్లు మంజూరు చేశారు. దాదాపు మూడేళ్ల నుంచి పనులు నిలిచిపోయాయి. ఉండవెల్లి మండలంలోని పోతులపాడు స్టేజి నుంచి కలుగొట్ల వరకు... గుంటూరు నుంచి మిన్నీ పాడు వరకు, తక్కశిల నుంచి ఇటిక్యాల పాడు వరకు రోడ్లు మంజూరయ్యాయి ఈ రహదారుల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇలా నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 11 రోడ్ల పనులు ప్రారంభించారు. కానీ ఎక్కడా బీటీ రోడ్డు వేయలేదు.

స్థానికుల అవస్థలు

గ్రామాల్లో రాకపోకలకు ఈ రహదారులే ప్రధానం. కంకర వేసి మధ్యలోనే పనులు వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర వేసిన రహదారుల ఫలితంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. దీనిపై అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: యమ డేంజర్‌: రోడ్లపై తిరుగుతున్న కొవిడ్ రోగులు..కారణం అదే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.