ETV Bharat / state

RDS CANAL: ఆర్డీఎస్​ కాల్వకు గండి.. పొలాల్లోకి పారుతోన్న నీరు

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు శివారులో ఆర్డీఎస్ కాల్వకు గండిపడింది. నిన్నటి నుంచి నీరంతా పొలాల్లోకి పారుతోంది. పంటలు వేయకముందే ఇలా ఉంటే.. వేశాక పరిస్థితేంటని రైతులు వాపోతున్నారు.

RDS CANAL: ఆర్డీఎస్​ కాల్వకు గండి.. పొలాల్లోకి పారుతోన్న నీరు
RDS CANAL: ఆర్డీఎస్​ కాల్వకు గండి.. పొలాల్లోకి పారుతోన్న నీరు
author img

By

Published : Jun 15, 2021, 12:36 PM IST

ఆర్డీఎస్​ కాల్వకు గండి.. పొలాల్లోకి పారుతోన్న నీరు

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులో ఆర్డీఎస్ కాల్వకు గండిపడింది. 34వ డిస్ట్రిబ్యూటర్‌ వద్ద కాల్వ కోతకు గురై.. 6 కిలోమీటర్ల మేర పొలాల్లోకి నీరు పారుతోంది. సేద్యం చేసిన పొలాల్లోకి నిన్నటి నుంచి నీరు పారుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు జూరాల జలాశయానికి ప్రవాహం రావడంతో కాల్వలకు నీళ్లు వదిలారు. ఆర్డీఎస్​ కాల్వకు అధిక మొత్తంలో నీరు వస్తుండగా.. మరమ్మతులు చేయక ఏళ్లు గడుస్తున్నాయి. ఏటా ఎక్కడో ఒక చోట గండ్లు పడుతున్నాయి. పంటలు వేయకముందే ఇలా ఉంటే.. వేశాక పరిస్థితేంటని రైతులు వాపోతున్నారు.

ఇదీ చూడండి: CORONA FREE VILLAGE: ఆంక్షలు పెట్టుకుని.. వైరస్​ను అడ్డుకుని..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.