రంజాన్ పండుగ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫాను అందజేస్తుంది. అలంపూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక మసీదులో ఎమ్మెల్యే అబ్రహం ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముస్లీంల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ పెట్టారని కొనియాడారు. అలంపూర్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఇవీ చూడండి: దారికొచ్చిన గురుకుల అధికారులు