జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మండలం రాజోలిలోని ప్రధాన రహదారిలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ స్థానికులు నిరాహార దీక్ష చేపట్టారు. నివాస గృహాలు ఉన్న చోట నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వైన్షాపును తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం దుకాణానికి మందుబాబుల తాకిడి ఎక్కవగా ఉందని.. ఎక్కడపడితే అక్కడే మద్యం సేవిస్తూ గొడవలకు దిగుతున్నారని దానితో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ స్థానికులకు వాపోయారు.
మద్యం షాపుకు ఒకవైపు ఆంజనేయ స్వామి దేవాలయం మరోవైపు గాంధీ విగ్రహం ఉన్నాయని అక్కడే వారు మద్యం సేవిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. దానితో ప్రజలకు మందుబాబులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటాయన్నారు. కావున అధికారులకు కలుగజేసుకుని వెంటనే వైన్షాపును తొలగించాలని వారు డిమాండ్ చేశారు.