జోగులాంబ గద్వాల జిల్లాలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష జెండా ఊపి ర్యాలీని ఆరంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి కేకే గార్డెన్ వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం కేకే గార్డెన్లో సభను నిర్వహించారు.
మీ తల్లిదండ్రులు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్లే విధంగా చూడాలని విద్యార్థులకు ఎస్పీ కృష్ణ సూచించారు. ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాలను 25% తగ్గించేందుకు ఈ సంవత్సరం నుంచే కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారి పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కందుల కొనుగోలు కేంద్రంలో రైతుల పడిగాపులు