రాష్ట్రంలో కనీసం యాభై వేల ఎకరాలలో పామాయిల్ తోటలను పెంచేందుకు కృషి చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆయిల్ మిల్లో పామాయిల్ మొక్కల సాగును ప్రారంభించారు. పామాయిల్ పరిశ్రమ ద్వారా బీచుపల్లి మిల్లును తిరిగి ప్రారంభించటమే తమ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో పామాయిల్ పంటలపై అధ్యయనం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో దాదాపు 206 మండలాలలో పామాయిల్ తోటలకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు హార్టికల్చర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారన్నారు. ఔత్సాహిక రైతులకు అధికారులతో అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా