ETV Bharat / state

offline classes: చిన్నపిల్లలకు స్కూల్​లోనే పాఠాలు.. గద్వాల జిల్లాలో ప్రైవేటు పాఠశాల నిర్వాకం

కొవిడ్​ నిబంధనలు పాటించకుండా ఓ ప్రైవేట్ పాఠశాల ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తోంది. కేవలం ఆన్​లైన్​ తరగతులకు మాత్రమే అనుమతి ఉండగా.. ఆఫ్​లైన్​లో క్లాసులు నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా వీరాపురం సమీపంలోని ఎస్సార్​ విద్యానికేతన్​ పాఠశాలను మండల విద్యాధికారి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.

private School offline classes
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల ప్రత్యక్ష తరగతులు
author img

By

Published : Jul 28, 2021, 5:34 PM IST

Updated : Jul 28, 2021, 6:38 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న బాగోతం బయటపడింది. కొవిడ్​ నిబంధనలను తుంగలో తొక్కి చిన్నారులకు ఆఫ్​లైన్​ క్లాసులు నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గద్వాల మండలం వీరాపురం సమీపంలో ఉన్న పాఠశాలను మండల విద్యాధికారి సురేశ్​ తనిఖీ చేయగా ఈ విషయం బహిర్గతమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆన్​లైన్​ తరగతులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతులిచ్చిందని ఆయన తెలిపారు.

offline classes

గత కొన్ని రోజులుగా ఎస్సార్​ విద్యానికేతన్​ పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో మండల విద్యాధికారి సురేశ్​ పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడే తరగతి గదిలో ఉన్న విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించడంరపై పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రశ్నించారు. చిన్నారులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. విద్యార్థులను వెంటనే ఇంటికి పంపించాల్సిందిగా పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు.

ఎస్సార్ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యాన్ని పలుమార్లు హెచ్చరించినా కూడా వారి తీరు మారడం లేదని మండల విద్యాధికారి సురేశ్​ మండిపడ్డారు. ఇదే విషయంపై జిల్లా విద్యాధికారి మహమ్మద్​ సిరాజుద్దీన్​ను వివరణ కోరగా.. పాఠశాల నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అక్కడ పరిస్థితిపై పూర్తిస్థాయిలో ఆరా తీసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో అన్నారు.

ఎస్సార్​ విద్యానికేతన్​ స్కూల్​లో ఆఫ్​లైన్​ క్లాసులు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఓసారి అక్కడికి వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. ఆ తర్వాతే బాధ్యులైన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం ఆన్​లైన్​ తరగతులకే మాత్రమే అనుమతి ఉంది. ఆఫ్​లైన్​లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

- మహ్మద్ సిరాజుద్దీన్​, జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖాధికారి

ఇదీ చూడండి:

ఆ ప్రభుత్వ స్కూల్లో చేరితే ఫ్రీ నాసా ట్రిప్!

Telangana Gurukul Schools : అత్తెసరు వసతులు.. అద్దె భవనాలు.. ఆదర్శ గురుకులాలు?

Last Updated : Jul 28, 2021, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.