ETV Bharat / state

తెలంగాణ ఏర్పాటుతో ఈగ్రామాల ప్రజలకు కొత్త కష్టాలు

summary: తెలంగాణ రాష్ట్రం వస్తే సౌకర్యాలు మెరుగుపడతాయనుకున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కలలు కన్నారు. వారి కలలు కల్లలయ్యాయి. కనీస సదుపాయాలు లేక జోగులాంబ గద్వాల జిల్లాలోని ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెలపాడు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఈగ్రామాల ప్రజలకు కొత్త కష్టాలు
author img

By

Published : Mar 21, 2019, 10:09 PM IST

ఈగ్రామాల ప్రజలకు కొత్త కష్టాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమవుతాయని, సౌకర్యాలు మెరుగుపడతాయని వారంతా ఆశించారు. కొత్త సదుపాయాలు మాటేమోగాని ఉన్నవి కాస్త దూరమయ్యాయి.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ మండలం పరిధిలోని ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెలపాడు గ్రామాల్లో సమస్యలు తిష్ట వేసుకుని కుర్చొన్నాయి. ఈ గ్రామాలన్నీ తుంగభద్ర నదికి అవతల వైపు ఉండడం, రహదారి సౌకర్యాలు లేకపోవడం... ఉన్న ఒక్క వంతెన పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఏం కావాలన్నా అలంపూర్​కే..

శ్రీశైలం బ్యాక్​ వాటర్​ కారణంగా అలంపూర్​ వద్ద తుంగభద్ర నదిలో ఎల్లప్పుడు నీరుంటుంది. ఏం కావాలన్నా ఆ మూడు గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన అలంపూర్​కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రమాదమని తెలిసినా సరైన రహదారి సౌకర్యం లేక కేసీ కెనాల్​పైనా... మత్స్యకారులు చేపలు పట్టే పుట్టీల ద్వారానే ప్రయాణాలు సాగిస్తున్నామని.. ప్రజలు వాపోతున్నారు.

వారికి తెలంగాణలో ఉద్యోగాలు రావు..

రహదారి సౌకర్యం లేక రాయలసీమకు వెళ్లి పిల్లలు చదువుతున్నారని... వారందరిని అక్కడ నాన్​లోకల్​ కేటగిరి కిందనే గుర్తిస్తున్నారన్నారు. అక్కడ చదవడం వల్ల తెలంగాణలో వారికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని వాపోయారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నందికొట్కూరు నుంచి బస్సు సర్వీసులు ఉండేవని విభజన అనంతరం పూర్తిగా సేవలు నిలిపేశారన్నారు.

తాగునీటి సమస్య అధికంగా ఉందని.. ఊరిలో ఒక్కే ట్యాంకు ఉందని విద్యుత్​ లేకపోతే తాగునీరు దొరికే పరిస్థితి లేదన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వాపోయారు.

అత్యవసర సమయాల్లోనూ ఆటోలు, ద్విచక్ర వాహనాలతో కేసీ కెనాల్​ కట్టలపై ప్రయాణాలు సాగిస్తున్నామని.. కనీస మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు.
ఇవీ చూడండి:ఈటీవీ భారత్​కు ఎంపీ కవిత శుభాకాంక్షలు...

Intro:tg_mbnr_23_20_nadi_avali_gramalu_pkg_c11 జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్
తెలంగాణ ఏర్పడ్డాక కూడా అభివృద్ధికి నోచుకోక అనేక అవస్థలు ఎదుర్కొంటున్న నది ఆవలి గ్రామాలు. అలంపూర్ మండల పరిధిలోని తుంగభద్ర నది అవతల ఉన్న ర్యాలంపాడు, సుల్తానా పురం, జిల్లెల్ల పాడు, గ్రామాలు అభివృద్ధి లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి . శ్రీశైలం బ్యాక్ వాటర్ వలన ఎప్పుడు అలంపూర్ దగ్గర తుంగభద్ర నదిలో నీరు ఉండేది మూడు గ్రామాల ప్రజలు ఏ పని ఉన్నా కూడా అల్లంపూర్ కి రావాలి రెవిన్యూ ఆఫీస్ ఎంపీడీవో ఆఫీస్ బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ మొదలైన వాటికి తప్పనిసరిగా అలంపూర్ కి రావాలి రావడానికి కి సౌకర్యం లేక నదిలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు ఉపయోగించే పుట్టి ల ద్వారానే ప్రయాణించే వారు ప్రమాదకరం అని తెలిసిన తప్పని పరిస్థితిలో ప్రయాణించే వారు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఈ మూడు గ్రామాల ప్రజలు రాయలసీమ లోని నందికొట్కూర్ బ్రాహ్మణ కొట్కూర్ కర్నూల్ వెళ్లి చదువుకునే వారు కానీ రాష్ట్రాల విడిపోయిన తర్వాత స్థానిక సమస్యతో ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడు గ్రామాలకు ఇప్పటివరకు ముఖ్యంగా జిల్లెల్ల పాడు సుల్తానా పురం గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదు ఈ గ్రామాలకు రాష్ట్రాలు కలిసినప్పుడు నందికొట్కూరు నుండి బస్సులు ప్రమాదకరంగా కేసీ కెనాల్ మీద తిరిగేవి కానీ రాష్ట్రం విడిపోయాక బస్సులు రావడం ఆపేశారు కాంగ్రెస్ హయాంలో అలంపూర్ నుంచి ఆవలి గ్రామాల తో పాటు శ్రీశైలం కు వెళ్లేందుకు అనువుగా ఉంటుందని బ్రిడ్జి కు శంకుస్థాపన చేశారు బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతూ కొద్దిమేర పూర్తి చేశారు ఇప్పుడు దానిపై ద్విచక్ర వాహనాలు ఆటోలు వెళ్లేందుకు కొంత అనుకూలంగా ఉన్నది బ్రిడ్జి పూర్తి కావస్తున్నది కాబట్టి తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం బస్సు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నారు ఎవరికైనా జబ్బు చేస్తే కనీసం వెళ్లడానికి చాలా ఇబ్బంది ఉంటుందని వాపోయారు ఆటోలు ద్విచక్ర వాహనాలతో కేసీ కెనాల్ కట్టపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ రోజులు గడుపుతున్నామని మా ఈ ఇబ్బందులను తీర్చాలని కోరుకుంటున్నారు

Body:జిల్లెల్ల పాడు గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నదని ని గ్రామస్తులు వాపోయారు గ్రామానికి అంతటికి ఒకే నీటి ట్యాంకు ఉన్నదని కరెంటు పోయింది అంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మిషన్ భగీరథ ట్యాంకి కట్టారు గాని ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు గ్రామంలో నెలకొన్న రోడ్డు తాగునీటి సమస్యను త్వరగా తీర్చాలని కోరారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.