ETV Bharat / state

పొంచిఉన్న ప్రమాదం... ఆందోళనలో చిన్నోనిపల్లి వాసులు - Jogulamba district news

నెట్టెంపాడు ప్రాజెక్టులో ముంపు గ్రామం చిన్నోనిపల్లి వాసుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. ముందుకుసాగని పునరావాస కేంద్రం పనులు. ఎడతెరిపిలేని వర్షాలకు కూలుతున్న ఇళ్లు. పునరావాస కేంద్రానికి వెళ్దామంటే ఎలాంటి వసతులు లేవు. ఒక్కో ఇంటిలో సుమారు రెండు మూడు కుటుంబాలు నివాసం ఉంటున్న పరిస్థితి.

నెట్టెంపాడు ముంపు గ్రామం.. చిన్నోనిపల్లి వాసుల అవస్థలు

author img

By

Published : Oct 11, 2020, 12:45 PM IST

జోగులంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం చిన్నోనిపల్లి ముంపు గ్రామం. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న జలాశయంలో గ్రామం ముంపునకు గురవుతుండడం గ్రామస్థులను కష్టాల్లోకి నెట్టింది. గ్రామం పూర్తిగా ముంపునకు గురి కావడం వల్ల అక్కడ కొత్తగా ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలకు సుమారు 20 ఇల్లు కూలిపోయాయి.

ఒక్కో ఇంట్లో...

ఒక్కో ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్థులు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చిన్నోనిపల్లి గ్రామ శివారులో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.5 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయం నిర్మిస్తున్నారు. 2007లోనే పనులకు శ్రీకారం చుట్టినా... నేటి వరకు జలాశయం, పునరావాస పనులు పూర్తి కాలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు 2,500 ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. సుమారు 360 కుటుంబాలు నిర్వాసితులుగా మారినట్లు తెలుస్తోంది

వసతుల లేమి...

అంతంపల్లి శివారులో సర్వే నంబర్ 421లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసేందుకు సుమారు 50 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అప్పటినుంచి పునరావాస పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ గ్రామంలో పర్యటించారు. గ్రామస్థులతో చర్చించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

చలనం ఏది...

జలాశయ పనులను గ్రామస్థులు పలుమార్లు అడ్డుకున్నారు. పునరావాస కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసి తమకు ఇళ్లు నిర్మించి ఇచ్చేంత వరకు పనులను అడ్డుకుంటూనే ఉంటామని తెగేసి చెబుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టినా... అధికారుల్లో చలనం లేదని వాపోతున్నారు.

ఇవీచూడండి: మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలో మొదటి సూపర్ మార్కెట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.