జోగులాంబ గద్వాల జిల్లాలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు స్వామివారి ఆలయంలో సమర్పించారు.
నవరాత్రి ఉత్సవాలు స్వామివారి అనుమతితో ప్రారంభిస్తున్నట్లు అర్చకులు స్వామివారి ఆనతి స్వీకరించారు. సంకేతంగా స్వామివారి బలిహరణం తీసుకొని అమ్మవారి ఆలయంలో ఉంచి హారతి ఇచ్చి దేవీ నవరాత్రులు ప్రారంభించారు.
ఈ రోజు నుంచి తొమ్మిది రోజులపాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అర్చకులు ప్రకటించారు. రోజూ వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు శైల పుత్రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఇదీ చదవండి: శరన్నవ రాత్రి శోభను సంతరించుకున్న భద్రకాళి ఆలయం