జోగులాంబ గద్వాల జిల్లాల్లో మొత్తం 4 పురపాలికలు ఉన్నాయి. వాటిలో గద్వాల, అలంపూర్లో కారు దూసుకెళ్లింది. వడ్డెపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. అయిజలో స్వతంత్రుల హవా కొనసాగింది. జిల్లాలో మెుత్తం 77 వార్డులకు గాను 34 తెరాస, 17 కాంగ్రెస్, స్వతంత్రులు 15 .. భాజపా 10, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కచోట గెలుపొందారు. అలంపూర్ మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. 10 స్థానాలకు గానూ... 7 తెరాస, 2 కాంగ్రెస్, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. వడ్డెపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 10 వార్డులకు గానూ 8చోట్ల కాంగ్రెస్, 2 తెరాస గెలుపొందింది.
గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులకు తెరాస19చోట్ల గెలుపొందింది. భాజపా 10 స్థానాల్లో సత్తాచాటింది. కాంగ్రెస్ 3, స్వతంత్రులు 4, మజ్లిస్ ఒక చోట విజయం సాధించారు. అయిజ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ 20వార్డులకు అత్యధికంగా 10స్థానాల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలుపొందారు. 6 చోట్ల తెరాస, 4 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందాయి..
