జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో ఇంటింటికీ తిరుగుతూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిడికెడు బియ్యం సేకరిస్తూ భిక్షాటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న పోరాటానికి మద్దతుగా భిక్షాటన చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రైతును రాజుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే కేంద్రం దీనికి భిన్నంగా రైతుల నడ్డివిరిచే చట్టాలను తీసుకొచ్చి వారిని నష్టాల ఊబిలోకి నెడుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: కరోనా టీకా తీసుకున్న వారిపై ప్రభావం ఎలా ఉందంటే?