జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీటీసీ ఛైర్మన్ సరితతో కలిసి ప్రారంభించారు. తుమ్మలచెరువు గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక ఇబ్బందులు పడుతున్నారని వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు.
అదేవిధంగా వాయిల్ కుంట తండా గ్రామంలో బీటీ రోడ్డు, మాచర్ల గ్రామంలో రైతు వేదిక భూమిపూజ, గ్రామపంచాయతీ భవన భూమిపూజ, చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ