జోగులాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలంలోని పాల్వాయి గ్రామానికి చెందిన కురువ చంద్రశేఖర్ అనే రైతు కొద్దికాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారికి రూ.5 లక్షల రైతుబీమా చెక్కును అందించారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. రైతులు, పేదలకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్, పీఏసీఎస్ ఛైర్మన్ సుభాన్, ఎంపీపీ విజయ్, గ్రామ సర్పంచ్ శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి